బ‌న్నీ టార్గెట్ అదే.. పొలిటిక‌ల్ ఎంట్రీపై మేనేజ‌ర్ ఓపెన్‌..!

admin
Published by Admin — July 24, 2026 in Politics, Movies
News Image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు, అటు రాజకీయ వర్గాలకు గత కొద్ది రోజులుగా ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదే బన్నీ పొలిటికల్ ఎంట్రీ. కాంగ్రెస్ పార్టీలో తన మావ‌య్య‌, స్నేహ‌రెడ్డి(Sneha Reddy) తండ్రి చంద్రశేఖర్ రెడ్డి యాక్టివ్‌గా ఉండటంతో, ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, రోజురోజుకూ ముదురుతున్న ఈ ఊహాగానాలపై అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని శరత్ చంద్ర తేల్చి చెప్పారు. ఇదంతా కేవలం కొందరు సృష్టించిన ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు. "ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) పాన్-ఇండియా స్థాయిలో అత్యంత క్రేజ్ ఉన్న స్టార్ హీరో. తన కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో బిజీగా ఉన్న నటుల్లో ఆయన ఒకరు. ఇలాంటి పీక్ స్టేజ్‌లో సినిమాలను పక్కనబెట్టి రాజకీయాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఆయనకు ఏమాత్రం లేదు" అని స్పష్టం చేశారు.

ఇక బన్నీ అసలు టార్గెట్ ఏమిటన్నది కూడా మేనేజర్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. అల్లు అర్జున్ దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయని, రాబోయే పదేళ్ల వరకు ఆయన డైరీ మొత్తం సినిమాలతోనే లాక్ అయిపోయిందని వెల్లడించారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి ఆలోచించే తీరిక, ఆస్కారం రెండూ బన్నీ(Bunny)కి లేవని స్పష్టం చేశారు. కేవలం మావ‌య్య రాజకీయాల్లో ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో ఇలాంటి నిరాధారమైన వార్తలు పుట్టించడం కరెక్ట్ కాదని శరత్ చంద్ర అభిప్రాయపడ్డారు. ఈ అధికారిక ప్రకటనతో, ఇప్పట్లో బ‌న్నీ పాలిటిక్స్ వైపు చూసే ప్రసక్తే లేదని, ఆయన ఫోకస్ అంతా సిల్వర్ స్క్రీన్ పైనే అని క్లియ‌ర్ క‌ట్‌గా తేలిపోయింది.

Tags
Allu Arjun Icon Star Allu Arjun Political Entry Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News