సీఎం ఆశీస్సులు తీసుకున్న యూరప్ ప్రత్యేక ప్రతినిధి 'జయ కుమార్ గుంటుపల్లి'

admin
Published by Admin — July 27, 2026 in Politics, Andhra, Nri, National
News Image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల యూరప్‌కు ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన లండన్‌కు చెందిన సీనియర్ ప్రవాస భారతీయుడు 'జయ కుమార్ గుంటుపల్లి' రాష్ట్ర ముఖ్యమంత్రి 'నారా చంద్రబాబు నాయుడు'ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి యూరప్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు ముఖ్యమంత్రికి 'జయ కుమార్ గుంటుపల్లి' హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, యూరప్‌లో నివసిస్తున్న తెలుగు ప్రవాసులు (ఎన్‌ఆర్‌ఐలు) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అక్కడి ప్రవాస ఆంధ్రులతో ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే యూరప్‌లో పెట్టుబడులు, వాణిజ్యం, విద్య, సాంకేతికత వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని అవకాశాలు తీసుకురావడానికి చొరవ చూపాలని ఆకాంక్షించారు.

'జయ కుమార్ గుంటుపల్లి' ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా యూరప్‌లోని ప్రవాస ఆంధ్రుల సంక్షేమం కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

 

Tags
jaya kumar guntuaplli europe specail rep cm chandra babu
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News