నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన, యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించడానికి రెడీ అయిపోయారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో బాలకృష్ణ ఒక భారీ సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఈ సినిమాకు సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం టాలీవుడ్ ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ రాజశేఖర్(Rajasekhar)ను ఎంపిక చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను తన యాక్షన్ ఇమేజ్‌తో ఏలిన రాజశేఖర్, ఇప్పుడు బాలయ్యకు పర్ఫెక్ట్ యాంటీ-హీరోగా స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం నిజంగా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ మార్క్ మాస్ డైలాగ్స్, రాజశేఖర్ పవర్‌ఫుల్ విలనిజం తోడైతే వెండితెరపై పూనకాలు గ్యారెంటీ అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
కాగా, ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకూలిస్తే ఈ నెల చివరి వారంలోనే సినిమా పూజా కార్యక్రమాలను జరిపి, వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్(Tollywood) టాప్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.