శ్రీను వైట్లతో శ‌ర్వా కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన BRS ఎమ్మెల్యే.!

admin
Published by Admin — August 14, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో మోస్ట్ ఎస్పెక్టెడ్ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ట్రెండ్‌కు తగ్గట్లుగా తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న టాలెంటెండ్ హీరో శర్వానంద్, మరోవైపు కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ల స్పెషలిస్ట్ డైరెక్టర్ శ్రీను వైట్ల(Sreenu Vaitla)తో కలిసి పనిచేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా లాంచ్ అయింది.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టడం విశేషం. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

'ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments)' పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ముందే రిలీజ్ డేట్‌ను లాక్ చేసేశారు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ పట్ల సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుందనే సంగతి తెలిసిందే. గతంలో ఆయన నటించిన కొన్ని పండగ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాలు నమోదు చేశాయి.

ఈ చిత్రంలో శర్వానంద్(Sharwanand) సరసన యువ నటి ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యమైన జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో శర్వానంద్, శ్రీను వైట్లలిద్దరూ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించనుంది.

Tags
George Krish Sharwanand Sreenu Vaitla AK Entertainments Sankranti 2027 Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News