మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఎంతో కాలంగా ఊరిస్తున్న భారీ విజయం ఎట్టకేలకు ఆయన ఖాతాలో చేరింది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఆయనకు, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇరుముడి(Irumudi)' చిత్రం తిరుగులేని బ్లాక్‌బస్టర్‌ను అందించింది. ఈ విజయం ఇచ్చిన జోష్‌లో ఉన్న చిత్ర యూనిట్, తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో సినిమా విశేషాలతో పాటు ఓ ఆసక్తికరమైన ఘటన అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
ఈ చిత్రంలో రవితేజ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర(Baby Nakshatra) తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కాకుండా, అద్భుతమైన నటనతో సినిమాకే ఒక సోల్‌గా నిలిచింది. కేవలం తెరపైనే కాదు, ప్రెస్ మీట్ వేదికపై కూడా ఈ చిన్నారి తన అందమైన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప నటనను ప్రత్యేకంగా కొనియాడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)' అధినేతలలో ఒకరైన రవిశంకర్ స్టేజ్ పైనే ఒక సంచలన ప్రకటన చేశారు. నక్షత్ర ప్రతిభను మెచ్చుకుంటూ ఆమెకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. "ఆమె పేరులోనే స్టార్ ఉంది. భవిష్యత్తులో నక్షత్రకు హీరోయిన్ కావాలనే ఆలోచన ఉంటే, మా సొంత కూతురిలా భావించి మా బ్యానర్‌లోనే ఆమెను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాం" అంటూ ఆయన బహిరంగంగా మాటిచ్చారు.
ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టిన ఈ చిన్నారికి టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఇలాంటి అరుదైన అవకాశం రావడం విశేషం. మైత్రి మేకర్స్ చూపిన ఈ గొప్ప మనసుకు, రవితేజ(Raviteja) కూతురిగా నక్షత్ర అందుకున్న ఈ గోల్డెన్ ఆఫర్‌పై అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.