ప్రియుడి కారుపై 3,400 ముద్దులు.. దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!

admin
Published by Admin — August 25, 2026 in National
News Image

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత చేసే విపరీత పోకడలు కొన్నిసార్లు కేవలం క్రేజ్‌తోనే ఆగవు. సరికొత్త ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వబోయి కొందరు చిక్కుల్లో పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విదేశీ ట్రెండ్‌ను అనుసరించి ఒక యువకుడు చేసిన సాహసం చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది.

విదేశాల్లో తెగ వైరల్ అవుతున్న ఒక వెరైటీ ట్రెండ్‌ను మనోడు మన దేశంలోకి ఇంపోర్ట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తన తెల్లటి స్విఫ్ట్ కార్‌ను ఎంచుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను రంగంలోకి దంపి, ఆమెతో కలిసి ఆ కార్ బాడీ నిండా ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో ముద్దుల గుర్తులు పెట్టించాడు. సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి ఆమె కారు మొత్తం లెక్కపెట్టలేనన్ని డిజైన్లలో ఏకంగా 3,400 కిస్ మార్కులను ముద్రించింది స‌ద‌రు గర్ల్‌ఫ్రెండ్‌. ఆ తర్వాత ఆ "కిస్సింగ్ కార్(Kissing Car)"తో నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ ఒక అదిరిపోయే రీల్ షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

ఇక ఆ తర్వాత జరిగిందంతా ఇంటర్నెట్ సంచలనం. అనుకున్నట్టుగానే ఆ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే దానికి ఏకంగా 55 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ఆ యువకుడు తెగ మురిసిపోయాడు. కానీ, ఈ కిస్సింగ్ కార్ సోషల్ మీడియా(Social Media) యూజర్లను మాత్రమే కాదు.. గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులను కూడా తీవ్రంగా ఆకర్షించింది.

రోడ్డుపై వెళ్లే వాహనాల రూపురేఖలను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం, పైగా నగరంలో అతివేగంగా రీల్స్ షూట్ చేయడం మోటార్ వెహికల్ యాక్ట్ కింద నేరమని పోలీసులు తేల్చారు. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఆ కారు నంబర్ ఆధారంగా వాహనాన్ని సీజ్ చేసి, సదరు యువకుడిని స్టేషన్‌కు పిలిపించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 5,500 జరిమానా(Fine) విధించడమే కాకుండా.. స్టేషన్ ప్రాంగణంలోనే స్వయంగా నీళ్లతో ఆ కారుపై ఉన్న ముద్దుల గుర్తులన్నింటినీ తుడిపించి శుభ్రం చేయించారు. రీల్స్ క్రేజ్ కోసం కారుపై పెట్టిన ముద్దులే ఆ యువకుడికి పెద్ద గుణపాఠం అయ్యేలా చేశాయి.

Tags
Kissing Car Viral Car Police Action Gwalior Viral News Fine Lipstick Marks Madhya Pradesh
Recent Comments
Leave a Comment

Related News