ఆ హీరోతో త‌న్నులు తిన్న అనుష్క.. అస‌లు విషయం తెలిస్తే షాక్!

admin
Published by Admin — April 04, 2026 in Movies
News Image

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి(Anushka Shetty) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వెండితెరపై ఆమె కనిపిస్తే చాలు.. ఆ రాజసం, ఆ అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే, షూటింగ్ సెట్స్‌లో అత్యంత మర్యాదగా ఉండే అనుష్క, ఒక స్టార్ హీరోతో తన్నులు తిన్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అదీ సాదాసీదాగా కాదు.. ఏకంగా కాలితో తన్నులు తిన్నారట. ఈ విషయం స్వయంగా ఆ హీరోనే వెల్లడించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈ ఆసక్తికర సంఘటన ఐకానిక్ సినిమా ‘బాహుబలి’(Baahubali) షూటింగ్ సమయంలో జరిగింది. ఆ చిత్రంలో భళ్లాలదేవ కొడుకు ‘భద్ర’ పాత్రలో నటించిన అడివి శేష్, తాజాగా తన సినిమా ప్రమోషన్లలో ఈ సీక్రెట్‌ను బయటపెట్టారు. బాహుబలి మొదటి భాగంలో ఖైదీగా ఉన్న అనుష్కను శేష్ వేధించే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సమయంలో అనుష్కను కాలితో తన్నాల్సి వచ్చినప్పుడు శేష్ చాలా ఇబ్బంది పడ్డారట. మొదట సున్నితంగా తన్నినప్పటికీ, దర్శకుడు రాజమౌళికి అది నచ్చలేదట. సీన్ పండాలంటే బలంగా తన్నాల్సిందే అని జక్కన్న ఆర్డర్ వేయడంతో శేష్ వేరే దారి లేక గట్టిగా తన్నాల్సి వచ్చింది.

అడివి శేష్(Adivi Sesh) అంత బలంగా తన్నడంతో అనుష్కకు నిజంగానే దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు ఆమె మెడ నొప్పితో చాలా సేపు ఇబ్బంది పడ్డారట. షూటింగ్ అయిపోయిన వెంటనే శేష్ పరిగెత్తుకుంటూ వెళ్లి అనుష్కకు సారీ చెప్పారట. ``అయ్యో.. పర్లేదు శేష్, ఇట్స్ ఓకే`` అంటూ అనుష్క తన పెద్ద మనసును చాటుకున్నారట. ఆ పేరులోనే స్వీటీ ఉంది.. ఆమె నిజంగానే చాలా స్వీట్ పర్సన్ అంటూ శేష్ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

కాగా, `హిట్-2` తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న అడివి శేష్, ఇప్పుడు `డెకాయిట్`(Dacoit) అనే భారీ యాక్షన్ డ్రామాతో మనముందుకు వస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా శేష్ పంచుకున్న ఈ `బాహుబలి` ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags
Anushka Shetty Adivi Sesh Baahubali Rajamouli Tollywood Dacoit Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News