సీఎం చంద్రబాబుకు కవిత రిక్వెస్ట్!

admin
Published by Admin — November 24, 2026 in Telangana
News Image

పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాకు నీటి హక్కులను తాకట్టు పెట్టింది కేసీఆర్, హరీష్ రావు అని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అందుకు సంబంధించిన ఆధారాలు బయట పెడతామని చెప్పారు. పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో బీఆర్ఎస్ నేతలు డ్రామా ఆడుతున్నారని కొట్టిపారేశారు. 2022లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు వాటర్ గ్రేడ్ జీవో జారీ చేశారని, అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.

ఆ ప్రాజెక్టుకు కేసీఆర్ అప్పుడు ఎందుకు అనుమతి ఇచ్చారని, అభ్యంతరం ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రజాపాలన చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని బీర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఏపీకి మంచి మనిషి, తెలంగాణను ముంచే మనిషి కేసీఆర్ అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికే పల్నాడు గ్రిడ్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని చెప్పారు. వైయస్సార్ క్యాబినెట్లో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అటువంటి హరీష్ రావు తనపై ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

మరోవైపు, కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏపీ అధికారిక అనుమతులు లేకుండా నీటిని మళ్లించుకుపోతోందని ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సీఎం చొరవ చూపాలని, న్యాయబద్ధమైన నీటి పంపిణీకి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Tags
kavita harish rao cm chandrababu water disputes
Recent Comments
Leave a Comment

Related News