బాల‌య్య చంక‌లో మాన్షన్ హౌస్.. సోద‌రి సెటైర్!

News Image

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల పద్మభూషణ్ అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బాల‌య్య కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలుపుతూ ఆయ‌న చెల్లెలు, సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి నిన్న రాత్రి స్పెష‌ల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో నంద‌మూరి, నారా ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో పాటు బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప్ర‌ముఖ యాంక‌ర్ ఉద‌య‌భాను ఈ పార్టీని హోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య‌తో వేదిక‌పై భువ‌నేశ్వ‌రి, పురందేశ్వ‌రి చిట్ చాట్ చేశారు. ఈ క్ర‌మంలోనే భువ‌నేశ్వ‌రి మాన్షన్ హౌస్ ప్ర‌స్తావ‌న తెస్తూ సెటైర్ వేశారు. `నీకు, మాన్ష‌న్ హౌస్ కు సంబంధం ఏంటి? వ‌సుంధ‌ర కంటే మాన్ష‌న్ హౌస్ ఎక్కువైందా? ఎప్పుడూ చంక‌లో పెట్టుకుని వెళ్తావంట‌` అంటూ భువ‌నేశ్వ‌రి అడ‌గ్గా.. బాల‌య్య ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. `నా జీవితంలో చాలా విష‌యాలు యాదృచ్ఛికంగానే జరిగాయి. మాన్షన్ హౌస్ అలవాటు కూడా అలానే జ‌రిగింది. అంతేత‌ప్ప‌ దాంతో ప్రత్యేకమైన అనుబంధం ఏమి లేదు. అదే నన్ను ప్రేమించింది. ఇక నాకు వసుంధర, మాన్షన్ హౌస్ రెండూ రెండు కళ్ళు. నాన్న గారు ఇల్లు కట్టించారు. ఆ ఏరియాలో అదే మొద‌టి ఇల్లు. ఆ ఇల్లు నాకు మాన్షన్ తో సమానం. ఆ మాన్షన్ లో మాన్షన్ హౌస్‌ ఉంటుంది` అంటూ బాల‌య్య న‌వ్వుతూ బదులిచ్చారు.

Related News