ఏపీ ప్రజలకు తాజాగా చంద్రబాబు సర్కార్ శుభవార్త తెలిపింది. పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు చేత పన్ను నుంచి విముక్తి కల్పించింది. ఇకపై రూపాయి కొట్టక్కర్లేదంటూ ప్రభుత్వం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం 2021 నవంబర్లో 40 పుర, నగరపాలక సంస్థల్లో చెత్తపై ప్రజల వద్ద నుంచి పన్ను వసూలు చేసింది. చెత్త పన్ను ద్వారా దాదాపు 187.02 కోట్ల రూపాయిలను వసూలు చేసింది. అయితే 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.